బుజ్జి కేటీఆర్‌కు రియ‌ల్ కేటీఆర్ ఫిదా!

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని సంబంధం లేని వారు క‌నెక్ట్ కావ‌ట‌మే కాదు.. ప్ర‌ముఖులు.. సెల‌బ్రిటీలు తెగ సంతోష‌ప‌డే ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. నిన్న (మంగ‌ళ‌వారం) బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లు స్కూళ్ల‌ల్లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అందులో భాగంగా పోటీలు నిర్వ‌హించారు.

ఇలాంటి పోటీలో రెండేళ్ల బాలిక అయినాను వారి త‌ల్లిదండ్రులు కేటీఆర్ మాదిరి ఫ్యాన్సీ డ్రెస్ పోటీల‌కు పంపారు. మంత్రి కేటీఆర్ త‌ర‌హాలో ఫ్యాంట్‌.. ష‌ర్గ్ వేయ‌టంతో పాటు మెడ‌లో టీఆర్ఎస్ కండువా వేసి పోటీకి పంపారు. కేటీఆర్ మాదిరే క్రాప్ కూడా త‌యారు చేశారు. కేటీఆర్ పేరుతో ఒక బ్యాడ్జిని త‌గిలించారు.

పోటీకి పంపే ముందు అయిరా త‌ల్లిదండ్రులు ఫోటో తీసి.. కేటీఆర్ ట్విట్ట‌ర్ అకౌంట్‌కు పంపారు. దాన్ని చూసిన వెంట‌నే స్పందించారు కేటీఆర్‌. అయిరా త‌ల్లిదండ్రులు పంపిన ఫోటో త‌న మ‌న‌సుకు హ‌త్తుకుందంటూ వారికి థ్యాంక్స్ చెప్పారు. బుజ్జి కేటీఆర్ రియ‌ల్‌కేటీఆర్ ను మాత్ర‌మే కాదు.. ప‌లువురి మ‌న‌సుల్ని దోచుకుంది.